బిగ్‌బాస్‌లో అర్జున్‌ రెడ్డి

vijay-devarakonda-in-bigg-boss-telugu-house-to-promote-arjun-reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. ఈ చిత్రానికి సంబంధించిన ముద్దు పోస్టర్‌ పోలీస్‌ కేసు వరకు వెళ్లింది. పోలీసులు సూచన మేరకు ముద్దు పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే సినిమాపై ఆ పోస్టర్‌ కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటించగా షాలిని హీరోయిన్‌గా నటించింది. సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్‌ భారీగా చేస్తున్నారు. 

ఇప్పటికే సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. మరింత పబ్లిసిటీ చేసేందుకు బిగ్‌బాస్‌ను అర్జున్‌ రెడ్డి ఆశ్రయించాడు. అర్జున్‌ రెడ్డి బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లి ఇంటి సభ్యులతో సందడి చేస్తూ, తన సినిమా ప్రమోషన్‌ చేయబోతున్నాడు. అర్జున్‌ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పటికే ఇంటికి వెళ్లడం జరిగిపోయింది. నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో విజయ్‌ దేవరకొండ కనిపించనున్నాడు. ఇప్పటికే బిగ్‌బాస్‌ సాయంతో రానా తన ‘నేనే రాజు నేనే మంత్రి’, తాప్సి ‘ఆనందోబ్రహ్మా’ చిత్రాలను ప్రమోట్‌ చేసుకున్నారు. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సెంటిమెంట్‌తో ఈ సినిమా కూడా తప్పకుండా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు:

పిక్‌టాక్‌ : సితార ఎంత క్యూట్‌గా ఉందో చూడండి

వివేకం… తెలుగు బులెట్ రివ్యూ.