జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడు..చంద్రబాబు అరెస్ట్‌ పై బాలకృష్ణ ఫైర్‌!

Jagan is not a ruler but an orbiter.. Balakrishna is on fire on Chandrababu's arrest
Jagan is not a ruler but an orbiter.. Balakrishna is on fire on Chandrababu's arrest

చంద్రబాబు అరెస్ట్‌ పై నందమూరి బాలకృష్ణ జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడంటూ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గమని.. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని మండిపడ్డారు నందమూరి బాలకృష్ణ. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం అంటూ ఫైర్‌ అయ్యారు.

నేను 16 నెలలు జైల్లో ఉన్నానని , చంద్రబాబుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలనే జగన్ జీవిత లక్ష్యమన్నట్టు కక్ష్యసాధిస్తున్నారు.ఎలాంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్క్కొన్నారు.

ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర. 19.12.2021 లో ఎఫ్ ఐఆర్ నమోదైంది, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్ సీటు చేయలేదు? డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింబచేసినపుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబందించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2.13 లక్షల విద్యార్దులకు శిక్షణ ఇవ్వంగా 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని ఏ విధంగా కుంభకోణం అని అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా? మళ్లీ తప్పల మీద తప్పుల చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారని బాలయ్య ఆగ్రహించారు .`