జనసేన పార్టీ లోకి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ?

Rajagopal joined the Janasena party?
Rajagopal joined the Janasena party?

రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ల‌గ‌డ‌పాటి రీ ఎంట్రీ కోసం అనుచ‌రుల స‌న్నాహక సమావేశం ఇవాళ విజయవాడలో జరిగిందని సమాచారం అందుతోంది. లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రావాలని పట్టుబడుతోంది ఆయన వర్గం.

ఈ నెలాఖరులో అనుచరుల ఆత్మీయ సమావేశంలో రాజగోపాల్ పాల్గొననున్నారు..విజయవాడ సిటీలో ఓ హోట‌ల్ లో నిన్న రహాస్య భేటీ జరిపారట. వచ్చే ఎన్నికల్లో బెజవాడ ఎంపీగా బరిలోకి దిగాలని ఆయన అనుచరులు కోరుతున్నారు . ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభ‌జ‌నకు వ్య‌తిరేకంగా పొలిటిక‌ల్ కెరీర్ కు రాజ‌గోపాల్ స్వ‌స్తి ప‌లికారు. ఇప్పుడు రీ – ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టం అవుతోంది. ఆయన జనసేన పార్టీ లోకి వెళతారని సమాచారం.