సముద్ర తీర ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశాలను అంఫాన్ తుపాన్ వణికిస్తోంది. దీంతో ఈ రాష్ట్రాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రెండు రాష్ట్రాలు అంఫాన్ ప్రభావంతో అతలాకుతలమౌతున్నాయి. అయితే ఈ ఘటన పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అవసరమైతేనే ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.
అంపాన్ తుఫాన్ ను దృష్టిలో పెట్టుకొని అమిత్ షా…. పశ్చిమ బెంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులైన మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్‌తో ఫోన్ మాట్లాడారు. ప్రస్తుతం ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారు. అన్ని విధాలా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలను ఆదుకుంటామని అమిత్ షా వారికి హామీ ఇచ్చారు. ప్రతి పౌరుడి భద్రత, రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు కూడ అమిత్ వారి దృష్టికి తీసుకువచ్చారు.