అత్తింటి వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఉప్పల్ పోలీసు స్టేషన్‌పరిధిలో సోమవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కల్యాణ్‌పురి టీచర్స్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి సతీష్ వివాహం ఎనిమిది సంవత్సరాల క్రితం పి. శ్రీలత(33)తో జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు. శ్రీలత ఉప్పల్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుంది.
కొంత కాలంగా శ్రీలత భర్త సతీష్ ఉద్యోగం మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో భార్యను మానసికంగా వేధించాడు. భర్తతో పాటు కుటుంబ సభ్యులు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని వారి వేధింపులు తాళలేక సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు కారణం అత్తింటి వేధింపులేనని ఉప్పల్ పీఎస్‌లో మృతురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.