షియోమీ ఎంఐ సీసీ9 ప్రొ “ఎంఐ నోట్10” పేరిట ఒక కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతుంది. చైనాలో ఎంఐ సీసీ9 ప్రొ పేరుతో రానుండగా, విడుదలకి సన్నాహాలు పూర్తి కాగా భారత్‌లో త్వరలో లాంచ్ చేయ బోనున్నారు. బ్యాక్ కెమెరా 108 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ కలిగి ఉంది. ఈ ఎంఐ నోట్ 10 ఫోన్‌లో 6.47 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 730జి ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 5260ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లతో రానుంది.
ఇప్పటి స్మార్ట్ ఫోన్లలో మనం అనేక పనులు చేసుకోగలుగుతున్నాం. ఏఫోన్ అయినా కెమెరా కెపాసిటీ ఎంత అనే దాని గురించి వినియోగదారులు చూస్తూ ఉంటారు. మంచి ఫొటోలు, వీడియోలు కోసం మంచి కెమెరా కెపాసిటీ ఉన్న ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. భారీ కెపాసిటీ ఉన్న కెమెరాలు ఉన్న ఫోన్లనే మొబైల్ తయారీ కంపెనీలు ఉత్పత్తి చేస్తు ఉండగా మార్కెట్‌లో 64మెగాపిక్సల్ కెమెరా ఉన్న ఫోన్లు రాగా ఇపుడు షియోమీ 108మెగాపిక్సల్ కెమెరా ఉన్న ఫోన్‌ను విడుదల చేయబోతుంది.
48ఎంపీ, 64ఎంపీ కెమెరా ఫోన్లను షావోమీ ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని ఐదు రేర్ కెమెరాలు పెంటా కెమెరా సెటప్‌తో తయారు చేయగా దీనిలో 20 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా 12 ఎంపీ కెమెరాను పోట్రెయిట్ షాట్స్ కోసం ఏర్పాటు చేయనున్నారు.108 కెమెరా సాంసంగ్ ఐసోసెల్ సెన్సర్ పని చేస్తుంది.