ఏపీలో విద్యావిధానం పై జగన్ సంచలన నిర్ణయం..

మనసున్న మనిషి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచీ విద్యాసంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా విద్యకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో ఫ్రీ-స్కూల్స్ ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

అయితే నాలుగున్నర నుంచి ఐదేళ్ల వరకు ఉన్న పిల్లలకు ఫ్రీ స్కూల్స్‌లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద 3,400 పాఠశాలల్లో ఇలాంటి ఫ్రీ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీంతో పిల్లల్లో ప్రతిభ వెలికితీయడం, మ్యాథ్స్ సబ్జెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. ఫ్రీ స్కూల్స్‌కు అవసరమయ్యే సిలబస్ రూపకల్పనపై అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు. ఫ్రీ-స్కూల్స్‌లో విద్య అయిన తర్వాత.. ఒకటో తరగతిలోకి విద్యార్థుల ప్రవేశం కల్పించనున్నారు. తొలి విడతగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నట్లు సమాచారం అందుతుంది.