కరీంనగర్ జిల్లా లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగులనుంది. కారు దిగేందుకు మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే… నేడు తన ముఖ్య అనుచరులతో సమావేశం రాజకీయ భవిష్యత్తు పై సమాలోచనలు చేయనున్నారు మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్.
కారు దిగే యోచనలో ఉన్న మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్.. కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ బిఅర్ఎస్ పార్టీలో చేరారు . బిఅరెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని కొంతకాలంగా మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ అసంతృప్తితో ఉన్నారు ఇప్పటికే మోహన్ తో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు . కానీ మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.