కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు క్రేజ్ మామూలుగా లేదు. సీఎం కేసీఆర్ ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి.. నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారునికి వివాహానికి హాజరైనప్పటికీ ,ప్రజలు హర్షాతిరేకాలతో కేరింతలతో స్వాగత నినాదాలు ఇచ్చారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా, తెలంగాణలో ఇప్పటి నుంచే రాజకీయ వేడి రగులుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి రాజకీయాలు హీటెక్కాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్ష పార్టీలన్నింటికి షాక్ ఇచ్చారు . ఈ జాబితాలో కేసీఆర్ పేరు రెండు సార్లు కనిపించడంతో రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. గజ్వెల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కామారెడ్డిలో కూడా గజ్వెల్ మాదిరిగా స్ట్రాంగ్ అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్న బీజేపీ, కాంగ్రెస్ అలాగే చేయాల్సి వచ్చింది.