బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు భాయిజాన్ చిత్రాలని ఎంతో ఇష్టపడతారు. వాటిని బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా చేస్తారు. చివరిగా భారత్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ప్రస్తుతం దబాంగ్ 3 చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతుంది. సల్మాన్ కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన పలు విషయాలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహ పరుస్తున్నారు. తాజాగా ఇరాన్‌కి చెందిన దివ్యాంగురాలు వీడియోని షేర్ చేశాడు. ఆమె సల్మాన్ వీరాభిమాని కాగా, తన కాలుతో సల్మాన్ స్కెచ్ వేసింది. తన పాదాలతో వేసిన ఈ స్కెచ్ సల్మాన్ హృదయాన్ని తాకింది. అభిమాని వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. దేవుడు ఆశీర్వాదంతో పాటు మరింత ప్రేమని పొందుతావు అని కామెంట్ పెట్టాడు సల్మాన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ వీడియోని ఇప్పటి వరకు 2,504,329 మంది వీక్షించారు.