దేశంలో మోదీ ప్రభుత్వ పాలనలో కొన్ని కీలకమైన చట్టాలు తీసుకురావడానికి ప్రత్యేక సమావేశాలను జరిపించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే సెప్టెంబర్ 18 నుండి 22 వరకు మొత్తం అయిదు రోజుల పాటుగా ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఎప్పటిలాగే మొదటి రోజు సమావేశాన్ని పాత పార్లమెంట్ భవనంలో జరిపించి. రెండవ రోజు అంటే 19వ తేదీన వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో సమావేశాలను నిర్వహించనున్నారు.
ఇక ఇక్కడే చాలా కీలకంగా భావిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ,కామన్ సివిల్ కోడ్ బిల్లు ఇలా చాలా వాటిని ప్రవేశ పెట్టనున్నారు.ఇక కొన్ని రోజులుగా చర్చలు మరియు ట్రోలింగ్ లో ఉన్న ఇండియా పేరును భారత్ గా మార్చడం కూడా ఇక్కడే. మరి ఈ బిల్లులు అన్నీ పాస్ అవుతాయా? ప్రతిపక్షాలు వీటన్నిటికీ మద్దతు తెలుపుతారా అన్నది తెలియాల్సి ఉంది.