నందమూరి కుటుంబం నుండి ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కానీ నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రమే హీరోలుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వీరిద్దరికీ ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకపోతే వ్యక్తిగతంగా వీరి మధ్య చాలా గ్యాప్ ఉంది. గత కొంత కాలం నుండి వీరి మద్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్లే నందమూరి కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమంలోను జూనియర్ ఎన్టీఆర్ కనిపించటం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇటీవల జూన్ పదవ తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాలకృష్ణకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియ చేయకపోవడం పై బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. సొంత బాబాయ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా సమయం లేదా అంటూ బాలకృష్ణ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా తమ అభిమాన హీరోని సమర్థిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పక పోయినప్పటికీ పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పి ఉండవచ్చు కదా అంటూ తన అభిమాన హీరోని సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు