మరో 3రోజులు తెలంగాణలో భారీవర్షాలు వాతావరణ కేంద్రం హెచ్చరిక..

వాతావరణ కేంద్రం

రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అన్ని ప్రాంతాల్లో భారీవర్షం కురుస్తూనే ఉంది అయితే మరో 2-3రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఒడిశాను ఆనుకొని ఉన్న దక్షిణ ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో ఉదయం అల్పపీడనం ఏర్పడింది. అనంత‌రం అది వాయవ్యంగా పయనించి ఉత్తర ఛత్తీస్‌గఢ్ తీరంలో కేంద్రీకృతమై స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 12.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో 3.1సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.