తెలంగాణలో మరో నాలుగురోజులు విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Heavy rains in Telangana for another four days. High alert for those districts
Heavy rains in Telangana for another four days. High alert for those districts

తెలంగాణలో గత రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు కురిశాయి. ఇక మొన్న, నిన్న కాస్త ఊరట ఇచ్చిన వరణుడు ఇవాళ మళ్లీ వచ్చేశాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని.. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. మరోవైపు ఈసారి ఈశాన్య రుతుపవనాలు ముందస్తుగానే రాక మొదలు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.