తెలంగాణలోని నాయయణ పేట జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లాడుతోందని.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న వైనం కలకలం రేపుతోంది. లింగంపల్లి పంచాయతీకి చెందిన కె.తిరుమలేశ్ అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ చాలా కాలంగా చెట్టపట్టాల్ వేసుకొని కలిసిమెలిసి తిరిగారు. దీంతో తిరుమలేశ్ ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన గొర్రెలను మేపడానికి ఖమ్మం జిల్లాకు వలస వెళ్లాడు. ఈలోగా అతడి ప్రియురాలికి వారం రోజుల క్రితం వేరే అబ్బాయితో పెద్దలు పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.