వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. రుతు పవనాల ప్రభావంతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నవీ ముంబైలోని ఖందేశ్వర్ రైల్వేస్టేషన్ కూడా పూర్తిగా నీటిమయం అయిపోయింది.
ఆ ప్రాంతంలో మోకాళ్లలోతు వరకు నీళ్లు చేరాయి. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని చిప్లూన్లో ముంబై-గోవా హైవే వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. రహదారులపై వరద నీరు చేరడం వల్ల కొన్ని రూట్లలో బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దాంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కురుస్తోన్న భారీ వర్షానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ముంబైలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది.