కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా.. దేశవ్యాప్తంగా 14రోజుల నాలుగో విడత లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నాలుగో దశలో కేంద్ర ప్రభుత్వం భారీగా సడలింపులను ప్రకటించింది. రాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కాయి. ఈ నెల 25వ తేదీ నుంచి విమానాలు.. ఆ రాబోవు నెల జూన్1 నుంచి రైళ్లూ అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా అధికారిక పర్యటన నిర్వహించనున్నారు.
అయితే ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్నారు. అయితే 83 రోజుల తర్వాత తొలిసారిగా ఆయన రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. చివరిసారిగా ఆయన ఫిబ్రవరి 29న ఉత్తర ప్రదేశ్ జిల్లాలో పర్యటించారు. కాగ అంఫాన్ తుఫాన్ బారిన పడిన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్తారు. మొదట పశ్చిమ బెంగాల్లో ఏరియల్ సర్వే చేపడతారు. అక్కడ అంఫన్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న జిల్లాలను పరిశీలిస్తారు. తూర్పు మిడ్నాపూర్, పశ్చి మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణ, దక్షిణ 24 పరగణా జిల్లాలతో పాటు రాజధాని కోల్కత మీదుగా ఆయన ఏరియల్ సర్వే కొనసాగుతుంది.