విసిగిపోయిన తండ్రి: సొంత కొడుకునే …….

murder

తెలంగాణలో ఘోరం చోటుచేసుకుంది.తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకులను చూశాము.కానీ తాజాగా ఓ తండ్రి సహనాన్ని తీవ్రంగా పరీక్షించిన కొడుకును తట్టుకోలేకపోయాడు.తాగుడుకు బానిసగా మారి నిత్యం కుటుంబ సభ్యులను వేధిస్తున్న కుమారుడిని తండ్రి హత్య చేశాడు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో  ఘటన జరిగింది. ఇందిరానగర్ లో నివాసం ఉండే నడిగోట్టు మల్లయ్య రజక వృత్తి చేసుకుంటూ జీవిస్తుండేవాడు. తన కొడుకు గణేష్ తాగుడుకు బానిస అయ్యాడు. దాంతో నిత్యం తాగేసి ఇంటికి వచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకొనేవాడు. అతడి ఆగడాలు భరించలేక గణేష్ భార్య స్వరూప 2 సంవత్సరాల క్రితమే భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే తాజాగా గత రాత్రి మద్యం ఫూటుగా తాగేసి ఇంట్లో గొడవ పడటంతో తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో సిమెంట్ ఇటుకను తీసుకొని కొడుకును కొట్టగా ఆయువు పట్టును తగలడంతో గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.