తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో డెడ్ బాడీ మాయమైన ఘటన సర్వత్రా కలకలం సృష్టిస్తోంది. కొత్తగూడెంకు చెందిన గుగులోతు శివ తాజాగా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే బాలున్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డాడు. కాగా పోస్ట్ మార్టం నిర్వహించేందుకు సిబ్బంది రెడీ అవ్వగా.. డెడ్ బాడీ మాయమైంది. దాంతో ఆస్పత్రి సిబ్బంది పోలిసులకు సమాచారం అందించడంతో అసలేం జరుగుతోంది ఆసుపత్రిలో అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.