సరికొత్త ఆయుధం పట్టనున్న నట సింహ నందమూరి హీరో NBK 107 అప్‌డేట్

నట సింహ నందమూరి హీరో బాలకృష్ణ పుట్టినరోజు శుక్రవారం (జూన్ 10). ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ NBK 107 నుంచి ఏదైనా అప్‌డేట్ ఏమైనా వస్తుందేమోనని ఇటు ఫ్యాన్స్… అటు కామన్ ఆడియెన్స్ సహా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో NBK 107 ఫస్ట్ హంట్ పేరుతో పోస్టర్ విడుదల చేశారు.

అందులో పులిచర్ల పేరుతో రాయి కనపడుతుంది. దానిపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఆ రాయిని అనుకుని సింహపు ఆకారపు నగిషీగా చెక్కిన గొడ్డలి కనిపిస్తుంది. దానికి కూడా రక్తమై ఉంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా కోసం బాలకృష్ణ విలన్స్ భరతం పట్టడానికి మరో సరికొత్త ఆయుధం పట్టబోతున్నారని అర్థమవుతుంది.