సీతక్కతో అంత ఈజీ కాదు.. గెలుపు కష్టమేనా ?

It is not so easy with Sitakka.. Is it difficult to win?
It is not so easy with Sitakka.. Is it difficult to win?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. బిఆర్ఎస్ తన అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం గురించి రాజకీయంగా రసవత్తరమైన చర్చ మొదలైంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి సీతక్క కాబట్టి, ఎప్పుడు సీతక్క నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యే ఉంటారు . అలంటి చోట సీతక్కకు చెక్ పెట్టాలని బిఆర్ఎస్ వ్యూహరచన చేసి ఆ దిశగా పావులు కలుపుతోంది. ఆ ఆలోచనల ఫలితమే బడే నాగజ్యోతి పేరును సీతక్క పై పోటీకి కేసీఆర్ ప్రకటించారు.

సీతక్క పై నాగజ్యోతి గెలవగలదా లేదా అని రాజకీయంగా చర్చ మొదలైంది. సీతక్క పీపుల్స్ వారి పార్టీలో పనిచేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. నక్సల్స్ ఉద్యమ పార్టీలు నాగజ్యోతి తల్లిదండ్రులు పనిచేసే ప్రాణాలు కోల్పోయిన త్యాగశీలులు. ఉద్యమ పార్టీలకు చెందిన వారే ఈ ఇద్దరూ, అయినా ఉద్యమంలో సీతక్క ప్రత్యక్షంగా పాల్గొన్నది. నాగజ్యోతి ఉద్యమకారుల వారసురాలు మాత్రమే. నాగజ్యోతి జడ్పీ వైస్ చైర్మన్ గా ఉంటూ, సీతక్క ప్రజలకు అందుబాటులోనే ఉంటూ అంతలా ప్రజలతో మమేకం కాలేరు.
2009లో సీతక్క టిడిపి నుండి విజయం సాధించింది.. 2014లో ఓడిపోయిన 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఘన విజయం సాధించింది. సీతక్క టిడిపి నుండి కాంగ్రెస్ లో చేరి రేవంత్ రెడ్డికి ప్రియ శిష్యురాలిగా అనిపించుకుంది. తెలంగాణ కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని తనపై ఎవరు పోటీ చేసిన గెలుపు కష్టమే అని రాజకీయ నిపుణులు అంటున్నారు.

కరోనా సమయంలో గిరిజనులకు బాసటగా నిలుస్తూ సీతక్క నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. భారీగా కురిసిన వర్షాలతో నీడ కోల్పోయిన నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండి తిండి, నీరు ,నివాస సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం నుండి రావలసిన సహాయాన్ని అందించడంలో సీతక్క తన వంతు కృషి చేశారు. ఇలా ఎప్పుడు ప్రజలకు చేరువుగా ఉంటూ ములుగు ప్రజలు సీతక్కను గుండెల్లో పెట్టుకున్నారు, ఎంతలా అంటే అక్కడ నిలబడే అభ్యర్థి సీతక్క అయితే చాలు పార్టీతో సంబంధం లేకుండా వారి ఓటు సీతక్కకే వేసి గెలిపించుకుంతలా,బి‌ఆర్‌ఎస్ అభ్యర్థిని నిలబెట్టి గెలుపు పొందాలనుకోవడం కష్టమే అని అందరి అభిప్రాయం.