తెలంగాణలోని హైదరాబాద్ నడిబొడ్డులో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. నగరంలోని దోమలగూడ వీధి నం.10 గగన్‌విహార్ ఫ్లాట్ నంబర్ 9లో నవీన్‌కుమార్ నివాసముండేవాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం అతను నివసించే ఫ్లోర్లో దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన పక్కింటి కుమార్ పాయల్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా నవీన్‌కుమార్ సోదరుడైన నితీశ్ కు కూడా సమాచారం అందించాడు. దీంతో పోలీసులు స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా.. నవీన్‌కుమార్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలోపడి ఉంది.