Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళంలో బిగ్‌బాస్ షో ఏ క్షణంలో ప్రారంభం అయ్యిందో కాని అప్పటి నుండి కూడా షోపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తమిళ సాంప్రదాయాలను మంట కలిపే విధంగా షో ఉందని కొందరు, హిందువుల మనో భావాలను కించపర్చే విధంగా ఉందని మరి కొందరు ఇలా పలువురు పలు రకాలుగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ మద్య తమిళనాట ఈ షోపై పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది. కమల్ హాసన్‌ను అరెస్ట్ చేస్తారనే చర్చ జరిగింది. కాని కమల్ మాత్రం ఏమాత్రం ఆందోళన చెందకుండా తనకు అప్పగించిన బిగ్‌బాస్ షోను నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా కమల్ బిగ్‌బాస్ షోపై తమిజఘం పార్టీ వారు కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది.
మురికి వాడల్లో ఉండే వారి తరపైన ఈ పార్టీ 100 కోట్లకు గాను బిగ్‌బాస్ షో హోస్ట్ కమల్ హాసన్, నిర్వాహకులు, అందులో పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రఫర్ గాయత్రి రఘురామన్‌లపై కేసు వేయడం జరిగింది. షోలో భాగంగా గాయత్రి ఒక పార్టిసిపెంట్ గురించి మాట్లాడుతూ ఆయన ప్రవర్తన మురికి వాడల్లో ఉండే వ్యక్తి ప్రవర్తనలా ఉందని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలు మురికి వాడల్లో ఉండే వారిని అవమానపర్చినట్లే అని, వారి జీవన విధానంపై వ్యాఖ్యలు చేసేందుకు ఆవిడ ఎవరు అంటూ తమిజఘం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరువునష్టం దావా వేయడం జరిగింది. దీనిపై తమిళ బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.
మరిన్ని వార్తలు: