మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. గత సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం చిత్రం టాలీవుడ్ టాప్ 3 చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే. నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్న రంగస్థలం చిత్రం మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇంకా కూడా రంగస్థలం రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా రంగస్థలం చిత్రంలోని రంగమ్మ మంగమ్మ చిత్రం పాటను యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్ల మంది చూశారు. తెలుగులో అతి తక్కువ సినిమా పాటలను మాత్రమే ఇంత భారీ స్థాయిలో చూడటం జరిగింది.
కలెక్షన్స్ పరంగా సునామి సృష్టించిన రంగస్థలం చిత్రం భారీ ఎత్తున ఇలా యూట్యూబ్ వ్యూస్‌ను కూడా దక్కించుకుంటున్న నేపథ్యంలో పాటలు ఏ రేంజ్లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రంగమ్మా మంగమ్మా పాటలో సమంత అందచందాలు, పిక్చరైజేషన్ ఇలా అన్ని కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం పాట సినిమా విడుదలకు ముందే సక్సెస్ అయ్యింది. అన్ని విధాలుగా సినిమా సక్సెస్‌కు ఈ పాట కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపర్చిన ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా మాస్ ఆడియన్స్‌ను అలరించారు. ఇక రంగమ్మ మంగమ్మ పాట చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అందరితో స్టెప్పులు వేయించింది. అందుకే వంద మిలియన్ల వ్యూస్ అంటే 10 కోట్ల వ్యూస్‌ను ఈ పాట దక్కించుకుంది.