కరోనా దెబ్బకు ప్రపంచమంతా విలవిలలాడిపోతుంది. దీంతో చమురు ఉత్పత్తికి తగ్గరీతిలో డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనప్పటికీ దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఏమాత్రం తగ్గ లేదు సరికదా.. భారీస్థాయిలో పెరగాయి. తగ్గిన ధరల వెసులుబాటును ప్రజలకు మళ్లించకుండా.. కేంద్రం ఎక్సైజ్రేట్లు పెంచకుంటూ పోతుంది. ఇలా తాజాగా మరోసారి కేంద్రం పెట్రోల్ పై భారీస్థాయిలో కొరఢా ఘలిపించింది. ఏకంగా లీటర్ పెట్రోలుపై రూ.10, డీజిల్పై రూ.13 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఇందులో రెండు రూపాయలు ఎక్సైజ్ సుంకంకా.. ఎనిమిది రూపాయలు రోడ్ సెస్ గా తెలిపింది. కొత్తగా కేంద్రం పెంచిన ధరలతో… దేశంలో లీటర్ పెట్రోలుకు దాదాపు 33 రూపాయలు ఎక్సైజ్ సుంకం రూపంలోనే కేంద్రం జేబులోకి వెళ్తుంది. నరేంద్రమోడీ 2014లో ప్రధాని అయినప్పుడు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం కేవలం తొమ్మిదిన్నర రూపాయలు మాత్రమే ఉండేది. అది కాస్తా ఇప్పుడు పెరుగుతూ వచ్చి.. 33 రూపాయలకు చేరింది. కాగా చమురు ధరల పతనం స్టార్ట్ అయ్యాక… ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. తగ్గిన చమురు ధరలు సామాన్యులకు దక్కకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రం తన ఖజానాకు మళ్లిస్తోంది. కరోనా లాక్డౌన్ వేళ .. ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిపోవడంతో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.