స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు వైరలయ్యాయి. అయితే చాలామంది నెటిజన్ల దృష్టి ఆమె ఒంటిపైన ఉన్న టాటూలపైకి మళ్లింది. ఆ టాటూల గురించే తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం.
సమంత ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు ఇంటర్నేషనల్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ఆమె ఓకే చెబుతున్నారు.ఆ సంస్థలకు సంబంధించిన వస్తువులను ప్రమోట్ చేస్తూ ఫొటోషూట్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా, ఇటీవల ఆమె బర్బెర్రీ అనే బ్రిటిష్ బ్రాండ్‌ని ప్రమోట్ చేశారు.
దీని కోసం ఆ సంస్థకు చెందిన దుస్తులు, బ్యాగ్స్‌తో ఫొటోషూట్‌లో పాల్గొని.. ఆ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. వాటిని చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ‘హాట్ బేబీ’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉండగా, మరికొంతమంది నెటిజన్లు మాత్రం ఆమె టాటూ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ టాటూ ఏమిటంటే.. ‘’చై’’. నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమయంలో ఆయనకు గుర్తుగా సామ్ తన శరీరంపై మూడు పచ్చబొట్లు వేయించుకున్నారు.
అందులో ఒకటి చేతి మణికట్టు వద్ద, మరొకటి మెడ వెనుక, మూడోది నడుము దగ్గర. నడుముపై ‘చై’ పేరుని రాయించుకున్నారు.అయితే గతేడాది, సామ్-చై విడిపోయిన అనంతరం.. వాటిని ఆమె అలాగే ఉంచుకుంటారా? లేదా తీయించేస్తారా? ఏమైనా మార్పులు చేయించుకుంటారా? అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోషూట్‌లో ‘చై’ పేరుతో ఉన్న టాటూ కనిపిస్తుండటంతో అందరి దృష్టి దానిపైనే పడింది. అలా, ఆమె టాటూ కాస్త మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, యశోదలో చిత్రాల్లో నటిస్తోంది.