పదమూడేళ్ళ బాలిక మీద, ఆరు నెలలుగా 22 మంది దుర్మార్గులు…

22 men rape 12-year-old Handicap Girl for 7 months in Chennai

మృగాలు సైతం ఈ ఘటన వింటే మనుషుల్ని అసహ్యించుకునేలా ఉంది ఈ ఘటన. దివ్యాంగురాలైన చిన్నారి మీద 22 మంది ఉన్మాదంగా ఏడు నెలల పాటు నరకయాతన పెట్టిన ఘటన కలచివేస్తోంది. కాపాడాల్సిన వారే కాటేసినట్టు నిందితుల్లో అందరూ సెక్యూరిటీ గార్డులే కావడంతో ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూదదో తెలియని పరిస్థితి నెలకొంది. వినడానికే భయంకరంగా అనిపిస్తున్న ఈ ఘటనకు సంబండింది చెన్నై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు… చెన్నైలోని అయినవరానికి పారిశ్రామికవేత్తకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హాస్టల్ ఉండి చదువుకుంటుండగా, అంగవైకల్యం ఉన్న చిన్న కుమార్తె(13) తమ సొంత అపార్ట్మెంట్లో ఉంటూ ఏడో తరగతి చదువుతుంది. చెన్నైలోని పురసవాక్కమ్‌‌లో 300 ఫ్లాట్లు ఉన్న భారీ అపార్ట్‌మెంట్ వారిది. చాలా వరకు ఖాళీగానే ఉన్న ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో 66 ఏళ్ల రవికుమార్ అనే వ్యక్తి ఎలివేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. కాగా బాలికపై కన్నేసిన లిప్ట్‌ ఆపరేటర్‌ బాలిక పాఠశాల నుంచి తిరిగి వచ్చే క్రమంలో అపార్ట్‌మెంట్‌లో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత కొద్ది రోజులకు మరో ఇద్దరు స్నేహితులలో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ ఇద్దరూ బాలికపై బలాత్కారాని పాల్పడుతూ వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రతిరోజూ ఆమె స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగానే మరికొందరు వ్యక్తులు పశువుల్లా ఎగబడడం మొదలు పెట్టారు. ఇలా నెలల తరబడి అనేక సార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గార్డ్‌తో సహా దాదాపు 17 మంది ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో బాలికకు మత్తుమందు ఇచ్చి అరవకుండా చేశారు. నగ్నంగా ఉన్న చిత్రాలను తీసి ఇంట్లో చెబితే వీటిని ఇతరులకు చూపిస్తామని బెదిరించారు. దుండగులు బెదిరింపులకు భయపడిన బాలిక ఇంట్లో అసలు విషయాన్ని చెప్పలేదు. బాలిక తల్లిదండ్రులు కూడా విషయాన్ని గ్రహించలేదు. కాగా ఢిల్లీలో చదువుతోన్న బాలిక అక్క సెలవులకు ఈ నెల 13న చెన్నైకి రాగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న బాలికను గమనించి విషయం ఏంటని అడగ్గా బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదంద్రులకు ఈ విషయాన్ని చెప్పి స్థానిక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జనవరి15 న లిప్ట్‌ ఆపరేటర్‌ రవి(66) తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో అత్యధికులు ‘ఫోకస్’ అనే ఓ సెక్యురిటీ సంస్థతో పాటు చెన్నైలోని యూకే ఫెసిలిటీ సర్వీసెస్‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం కిల్పాక్ మెడికల్ కాలేజికి తరలించారు. దివ్యాంగురాలైన బాలికపై దారుణానికి ఒడిగట్టిన 17మంది కామాంధులను సైదాపేట కోర్టు లాయర్లు చితకబాదారు. కోర్టుకు తరలిస్తున్న సమయంలో అక్కడే ఉన్న కొంతమంది లాయర్లు వారికి దేహశుద్ధి చేశారు. దివ్యాంగురాలు అనే కనికరం లేకుండా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతారా అంటూ న్యాయవాదులు వారిని చితక్కొట్టారు.