ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో ఠాక్రే కుటుంబానికి చెందిన వారు పోటీ చేయ లేదు. తొలి సారి అదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ స్థానం నుండి ఎన్నికలలో పోటీ 70వేల ఓట్లకు పైనే మెజార్టీతో గెలిచారు. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న ఠాక్రే తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన అదిత్యకు 29ఏళ్లకే ముఖ్మంత్రిగా అవకాశం వస్తే హిస్టరీనే అని చెప్పుకోవచ్చు.
రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాదించక పోగా మహారాష్ట్రలో బీజేపీ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి 29 ఏళ్ల కుర్రాడు అదిత్య ఠాక్రే అనే మాట బలంగా వినబడుతుంది.
పోయిన ఎన్నికల కన్నా ఇరవై సీట్లు తగ్గి పోగా శివసేన సీట్ల సంఖ్యను పెంచడం వల్ల శివసేన లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం సాధ్యం కాదు కాబట్టి పార్టీకి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకూ సీఎంగా ఉన్న ఫడ్నవీస్ అధికారాన్ని శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రేకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
సీట్ల పంపిణీ ఎన్నికలకు ముందే సమయంలోనే ఒప్పందం జరిగినట్లుగా శివ సేన చెప్తూ అనుకున్న దాని ప్రకారం అమలుచేయాలని శివసేనని కోరగా, తొలి రెండున్నరఏళ్ల పాలనను శివసేనకి తర్వాత రెండున్నర ఏళ్ల బీజేపీకి ఇవ్వాలని కోరింది. కాగా బీజేపీ తమ నిర్ణయాన్ని మాత్రం ఇంకా తెలుపలేదు.