తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది. తాజాగా మరో మూడు కొత్త కేసులను గుర్తించారు. జర్మనీ నుంచి వచ్చిన ముప్పై ఎనిమిది ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ రాగా.. సౌదీ నుంచి వచ్చిన అరవై ఏళ్ల మహిళకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే.. లండన్ నుంచి వచ్చిన నలభై తొమ్మిది ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో మొత్తం తెలంగాణ ఆరోగ్య శాఖ తెలపినట్లుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది.అదేవిధంగా ఇంకా తెలంగాణలో మరికొన్ని కేసులకు సంబంధించి దాదాపు తొంబై ఏడు మందికి రిపోర్ట్ లు రావాల్సి ఉంది. వాటిలో ముగ్గురు రిపోర్ట్ లు వస్తే.. అవి మూడు కూడా పాజిటవ్ అని తేలింది. కాగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇండియాలోని రాష్ట్రాలు లాక్ డౌన్ చేశాయి. ప్రజలు బయటకు రాకుండా ఉండాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలు కూడా అర్ధం చేసుకొని చాలా వరకు బటయకు రావడం లేదు. నిన్నటి వరకు తెలంగాణలో 33 పాజిటివ్ కేసులు ఉండగా.. ఈరోజు మరో ముగ్గురికి పాజిటివ్ రావడం రాష్ట్రంలో కలకలం రేగుతుంది. ఈ మూడు పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లండన్ నుంచి కూకట్ పల్లి వచ్చిన వ్యక్తికీ, జర్మనీ నుంచి చందానగర్ కు వచ్చిన మహిళకు, బేగంపేటకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.