తెరాస టార్గెట్ సెంచరీ కాదు హాఫ్ సెంచరీ…!

50 Seats Enough For TRS To Grab Power

“100 సీట్లు గెలుస్తాం”…ముందస్తు ఎన్నికలకు వెళదాం అనుకున్న దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ , ఆయన కుమారుడు కేటీఆర్ నోట పదేపదే వినిపించిన మాట ఇది. ఆ ఇద్దరు చెప్పినట్టు తెరాస 100 సీట్లు గెలుస్తుందని ఎవరూ అనుకోకపోయినా ఆ పార్టీ విజయానికి అడ్డే లేదని చాలా మంది నమ్మారు. కానీ కొంగర్ కలాన్ సభ దగ్గర నుంచి పరిణామాలు అనూహ్యంగా మారిపోతూ వచ్చాయి. మహాకూటమి ఏర్పాటు , సీట్ల సర్దుబాటు జరిగిపోయాయి. ఆ టైం లో జరిగిన రచ్చ చూసి కూటమి ఓటమి తప్పదు అనిపించినా రోజురోజుకి అధికార పార్టీ బలం తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తెలంగాణాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు స్థానిక ప్రజల నుంచి సమస్యల మీద ఇతర ప్రభుత్వ హామీల మీద ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఈ పరిణామాన్ని తెరాస మాత్రమే కాదు ఏ రాజకీయ పార్టీ ఊహించలేదు. విశ్లేషకులు అంచనా వేయలేకపోయారు. అందుకే మీడియా సైతం తెరాస అనుకూల కధానాలకే పరిమితం అయ్యింది.

KCR Fair on Chandrababu
ప్రజాస్పందన అందుకు భిన్నంగా ఉండడం చూసాక మీడియా ధోరణిలో కూడా కొద్దిపాటు మార్పు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణాలో భావోద్వేగాలు రెచ్చగొట్టాలని తెరాస వేసుకున్న వ్యూహం కూడా పెద్దగా ఫలిస్తున్నట్టు లేదు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ని వదిలిపెట్టి కొద్ది సీట్లలో పోటీ చేస్తున్న టీడీపీ గురించి మాట్లాడ్డం కూడా ప్రజల్లో పెద్ద ప్రభావం కనిపించడం లేదు. 90 కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంటే ఆ పార్టీ గురించి మాట్లాడకుండా చంద్రబాబుని టార్గెట్ చేయడం కూడా ఫలించలేదు. దీంతో పాటు చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి తెలంగాణ కి వస్తారని కూడా తెరాస భావించలేదు. కానీ బాబు హైదరాబాద్ సభలకు వస్తున్న స్పందన తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకప్పుడు సెంచరీ అంటూ 100 సీట్లు గురించి తప్ప మాట్లాడని తెరాస నాయకుల ఆంతరంగిక సంభాషణల తీరు మారిందట. కనీసం 50 స్థానాల్లో గెలిస్తే చాలు , ఎంఐఎం, బీజేపీ సాయంతో పాటు కొందరు స్వతంత్రుల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయగలం అని తమకు తామే ధైర్యం చెప్పుకుంటున్నారట. అదండీ సెంచరీ నుంచి హాఫ్ సెంచరీ కి దిగిన తెరాస వ్యవహారం.

kcr talks about earlier telangana Polls