తల్లి నిరాకరించిందని ఏడాది పాప మీద అఘాయిత్యం…!

52Year Old Man Arrested For Rape

రానురాను మనుషులు మరీ మ్రుగాళ్ళలా తయారు అవుతున్నారు. తన కోర్కెను తీర్చేందుకు నిరాకరించిందనే కోపంతో ఒక మహిళకు పుట్టిన ఏడాది పసికందుపై ఓ వ్యక్తి అఘాయిత్యం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బాధితురాలి కుటుంబానికి బంధువైన నిందితుడు కొద్దిరోజులుగా సదరు మహిళను లోబరుచుకునేందుకు యత్నిస్తుండగా ఆమె తిరస్కరించింది.

baby

లైంగిక దాడికి తెగబడేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లగా ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ఆమె ఏడాది కుమార్తెపై దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అదే రాత్రి మరోసారి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె నాలుగేళ్ల కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మ మహిళ పోలీసులని ఆశ్రయించగా సదరు నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

baby-raped-madhaya-pradesh