రేపిస్టుకు 615 ఏళ్ల జైలు శిక్ష విదించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ రేపిస్ట్ గురించి వింటే చంపేయమంటారు మీరు. ఎందుకంటే ఆ దరిద్రుడు చేసే లైంగిక దాడులు చాలా దారుణంగా ఉంటాయి. 16 ఏళ్లలోపు బాలిక కనిపిస్తే చాలు అతడిలో రాక్షసుడు నిద్రలేస్తాడు. వారిపై కలబడి లైంగిక దాడికి పాల్పడతాడు. అత్యాచారం చేస్తాడు. ఈ కిరాతకుడికి మరో దారుణమైన అలవాటు కూడా ఉంది. తాను రేప్ చేసే అమ్మాయిలతో అసహజంగా వెనుక నుంచి సెక్స్‌లో పాల్గొంటాడు. సహకరించకపోతే దారుణంగా కొడతాడు. ఈ సీరియల్ రేపిస్ట్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అడవిలో మృగం ఊరి మీద పడితే ప్రజలకు ఎంత ప్రమాదమో ఇలాంటి నేరగాడిని జనాల్లోకి వదిలితే అంతే ప్రమాదమని భావించిన కోర్టు అతడికి 615 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అంతేకాదు, అతడికి బెయిల్ పెరోల్ లాంటివి కూడా ఇవ్వకూడదని తీర్పు ఇచ్చింది. ఈ ఘటన అమెరికా అలబామాలోని హూస్టన్ కౌంటీలో చోటుచేసుకుంది. స్మిత్ చేసిన నేరాలు విన్న హూస్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటర్నరీ జేటీ జోన్స్ కోర్టులో ఏడ్చేంత పనిచేశారు. తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన నేరగాడికి చీవాట్లు పెట్టారు. ‘‘నువ్వు చిన్నారులపై చేసిన ఆ అరాచకాలు.. ప్రతి రోజు నీ గుండెకు గుచ్చుకోవాలి. ఆ సమయంలో వారు అనుభవించిన బాధ నీకు తెలియాలి’’ అని అన్నారు. స్మిత్ 2011 నుంచి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇన్నాళ్లూ పరారిలో ఉన్న ఈ సీరియల్ రేపిస్ట్‌పై ఇంకా ఎన్నో సెక్స్ కేసులు ఉన్నాయి.