ట్రక్కును ఢీకొన్న బస్సు.. 9మంది వలస కూలీలు మృతి….

accedent

దేశంలో కరోనా దాడి వలస కూలీల బ్రతుకులను చిందరవందర చేస్తోంది. లాక్‌డౌన్‌తో ఉన్న ప్రాంతాలను వదిలి.. సొంతూళ్లకు వెళ్తోన్న వలస కార్మికులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక ఘటన ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. దీంతో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు.తాజాగా బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవగాచియా జాతీయ రహదారి 31లో, అంబో గ్రామం దగ్గర ఎదురుగా వస్తున్న ట్రక్.. బస్సు ఢీకొన్నాయి. ఇక్కడ జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది వలస కూలీలు ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో ట్రక్ బోల్తా పడడంతో.. ఆ ట్రక్కు కింద ఇరుక్కుపోయిన కార్మికులను వెలికి తీసి ఆస్పత్రులకు తరలించారు. అయితే మృతులంతా ట్రక్కులో ప్రయాణిస్తున్నవారిగానే గుర్తించారు. అలాగే.. బస్సులో ఉన్న 35 మంది బంకా జిల్లాకు చెందిన 35 మంది గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.