కుమారి 21ఎఫ్, ఆర్ఎక్స్ 100 చిత్రాల మాదిరిగా బేబీ సినిమా.?

Vaishnavism
Vaishnavism

ప్రస్తుత సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక తరానికి మరో తరానికి మధ్య ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పు ఒక రంగానికే చెందిందా అనే ప్రశ్న తలెత్తితే కాదని చెప్పవచ్చు. టెక్నాలజీ విషయంలో కావచ్చు… సినిమా రంగంలో కావచ్చు ఇలా ఏదైనా సరే కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఒకప్పటి తరం ప్రేక్షకులు కుటుంబ కథ నేపథ్యంలో వచ్చే చిత్రాలను చూడడానికి ఇష్టపడేవారు. ఇక ఆ తర్వాత తరం యాక్షన్, లవ్ స్టోరీ వంటి కథలను ఇష్టపడేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది.

మారుతున్న కాలానికి అనుగుణంగా దర్శకులు సైతం తాము తీయబోయే చిత్రాలలో కొత్త స్ట్రాటజీని అప్లై చేస్తూ ప్రేక్షకులను ఏ విధంగా ధియేటర్లకు రప్పించగలం అనే దిశగా ఆలోచిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలం సినీ పరిశ్రమలో విడుదలైన చిత్రాలలో హీరోయిన్స్ పాత్రలను చెడ్డగా చూపిస్తేనే సినిమా హిట్ అవటం అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కుమారి 21ఎఫ్ లో హెబ్బా పటేల్, ఆర్.ఎక్స్100 లో పాయల్ రాజ్ పుత్ , నేడు బేబీ సినిమాలలో హీరోయిన్ వైష్ణవి పాత్రలను కొంత సమయం పాజిటివ్ గా కొంత సమయం నెగిటివ్ గా చూపించడం జరిగింది.

ఇక ముందు ముందు కాలంలో కూడా దర్శకలు ఇదే టైప్ ఆఫ్ వ్యూహాన్ని ఫాలో అవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ తరహా చెడు వైఖరి చిత్రాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా చెడు వైఖరి క్యారెక్టర్ లో నటించినా కుమారి 21ఎఫ్, ఆర్.ఎక్స్100, బేబీ సినిమాలలో హీరోయిన్లు కొత్త వారు కావడం గమనార్హం. ఎందుకంటే ఇలాంటి చిత్రాలను నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఒప్పుకోరు కనుక.

ఇలా హీరోయిన్ల పాత్రల విషయంలో హద్దులు దాటి చెడుగా చూపించడం అంతా కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయాలు వెల్లడి చేస్తున్నారు. సొసైటీల్లో కేవలం ప్రేమికులను మోసం చేసే అమ్మాయిలు మాత్రమే ఉన్నారా…? అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు లేరా..? ఇలా హీరోయిన్స్ ని మాత్రమే చెడు వైఖరిలో చూపిస్తేనే సినిమాలు హిట్ అవుతాయా.. అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.