స్మార్ట్ఫోన్లలో వన్‌ప్లస్ బ్రాండ్‌కు ప్రత్యేకతే వేరు. ఎందుకంటే ఈ ఫోన్లలో ఫీచర్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అయితే వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లలో స్క్రీన్‌పై గ్రీన్ లైన్లు వస్తుండటంతో గత కొంత కాలంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ‘‘గ్రీన్-స్క్రీన్’’ సమస్య ఉన్న వినియోగదారులకు వన్ ప్లస్ జీవితకాల వారంటీని అందజేస్తోందని,ఈ వారంటీ అన్ని మోడళ్లకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సమస్య ఉన్న పాత వన్‌ప్లస్ ఫోన్లను కూడా మార్చుకోవచ్చని, వారికి వారంటీతో పాటు కంపెనీ తరపు నుంచి మరికొన్ని ప్రత్యేక తగ్గింపులు అందజేస్తున్నట్లు ప్రకటించింది.
వన్ ప్లస్ 8Pro, వన్ ప్లస్ 8T, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9Rతో సహా పాత వన్ ప్లస్ ఫోన్లలో ప్రధాన సమస్య ఏంటంటే.. వాటికి సంబంధించిన ‘‘స్పేర్ పార్ట్స్’’ లేకపోవడం. ఇలాంటి ఫోన్లను కలిగి ఉన్న వ్యక్తులు కొత్త వన్ ప్లస్ ఫోన్లకు, ముఖ్యంగా వన్ ప్లస్ 10Rకి అప్‌గ్రేడ్ చేస్తే రూ.30,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అదే కొత్తగా వన్ ప్లస్ 10Rని రూ.5 వేలు నుంచి రూ.10 వేల వరకు కొనుగోలు చేయొచ్చు.
లైఫ్‌టైమ్ వారంటీ..
భారతదేశంలోని వినియోగదారులు మాత్రమే ఆండ్రాయిడ్ అథారిటీ నివేదించిన ప్రకారం లైఫ్‌టైమ్ వారంటీని పొందుతారు. నివేదికల ప్రకారం, గ్రీన్ స్క్రీన్ సమస్యతో ఫోన్ల యూజర్లకు కలిగే తీవ్ర అసౌకర్యాన్ని కంపెనీ అర్థం చేసుకుందని, దీనికి సంబంధించి తీవ్రంగా చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నట్లు వన్ ప్లస్ తెలియజేసింది. ఇకపై మీకు సమీపంలో ఉండే వన్ ప్లస్ కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించండి.అవసరమైతే మీకు వారు మీ ఫోన్‌ను చెక్ చేసి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్మెంటును అందజేస్తారు.
కొత్త ఫోన్‌కు మారితే..
వన్ ప్లస్ సెలెక్ట్ చేసిన కొత్త స్మార్ట్ఫోన్లకు వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్ల నుంచి అప్‌గ్రేడ్ చేసే వ్యక్తుల కోసం వోచర్‌ను కూడా ప్రవేశపెట్టిందని కంపెనీ పేర్కొంది. ఇది వారికి ఫోన్ విలువలో సరసమైన శాతాన్ని ఇస్తుంది. కొత్త వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లలో గ్రీన్ స్క్రీన్ సమస్యలు ఉండే అన్నీ ఫోన్లకు ఇప్పుడు లైఫ్ టైమ్ స్క్రీన్ వారంటీని అందజేస్తోందని వన్ ప్లస్ అధికారులు తెలియజేసినట్లు ఆండ్రాయిడ్ అథారిటీ నివేదించింది.
గొప్ప వోచర్లు..
గ్రీన్ లైన్ సమస్య ఉన్న వన్ ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు కొత్త వన్ ప్లస్ ఫోన్‌కి అప్ గ్రేడ్ చేసినప్పుడు రూ.25,500 విలువైన వోచర్‌ను పొందుతారని కంపెనీ తెలిపింది. వన్ ప్లస్ 8T స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్న వారికి రూ.20 వేల వోచర్ లభించనుంది. వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9T ఫోన్లకు వరుసగా రూ.23,500, రూ.19,000 విలువైన వోచర్లు లభించనున్నాయి. ఈ ఆఫర్లన్నీ కొత్త వన్ ప్లస్ ఫోన్ కొనాలనుకునే వారికి అందుబాటులో ఉన్నాయి.
వన్ ప్లస్ 10R
పాత వన్ ప్లస్ ఫోన్లను వాడుతున్న యూజర్లు కొత్త వన్ ప్లస్ 10Rకి అప్‌గ్రేడ్ అయితే రూ.4,500 అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ డిస్కౌంట్ పైన పేర్కొన్న ప్రతి ఫోన్లకు అదనపు డిస్కౌంట్. అంటే రూ.34,999 నుంచి రూ.39,999 మధ్య ఉండే వన్ ప్లస్ 10R స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులో రానున్నాయి.
Oneplusలోనే ఈ సమస్య..
గత కొంత కాలంగా మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ వన్ ప్లస్ యూజర్లు గ్రీన్ స్క్రీన్ సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, చర్చలు వెల్లువెత్తాయి. ఈ ఫోన్ పర్మార్ఫెన్స్ బాగున్నప్పటికీ, గ్రీన్ లైన్ సమస్య బాగా ఇబ్బంది పెడుతుందని చాలా మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. వన్ ప్లస్ ఫోన్ల ఉన్న AMOLED డిస్ప్లే లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.