భర్తపై అనుమానం పెంచుకున్న ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. పరాయి మహిళలతో మాట్లాడుతున్నాడని అనుమానించి ఏకంగా భర్త జననాంగాన్ని కత్తిరించి పడేసింది. చైనాలోని జియాంగ్సి ప్రొవిన్స్, ఫెంగ్‌చెంగ్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో లీ, అతని భార్య నివసిస్తుండేవారు. పరాయి మహిళలతో చనువుగా ఉంటున్నాడంటూ ఆ భార్య భర్తతో తరచూ పడుతుండేది. ఈ మధ్యే లీ ఉద్యోగం మారాడు. అయితే కొత్త కంపెనీలో మహిళలతో చనువుగా ఉండటంతో వారితో ఇల్లీగల్ అఫైర్లు నడుపుతూ తనను భర్త మోసం చేస్తున్నాడని ఆమె అనుమానించింది. అన్నింటికి కారణం మగతనం అని భావించి అదే లేకపోతే భర్త తనతోనే ఉంటాడని భావించి దాన్ని తొలగించాలని నిర్ణయించుకుంది.
ఉదయం అతను బ్రష్ చేసుకుంటున్న సమయంలో ప్యాంట్‌ను కిందకు లాగి, అతని మర్మాంగాన్ని కట్ చేసి అవతల పడేసింది. తీవ్ర రక్తస్రావంతో మాట్లాడలేని స్థితిలో లీని ఆస్పత్రికి తీసుకెళ్ళింది. శస్త్ర చికిత్స చేసి తిరిగి పార్ట్‌ను అతికించిన వైద్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరాయి మహిళలతో మాట్లాడినా వారిని చూసినా తన భార్య టార్చర్ పెట్టేదని సరదు బాధితుడు చెబుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూలై 21న ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.