కార్తికేయ, పాయల్ రాజ్‌పూత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’. ఈ చిత్రం తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందీలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను స్వయంగా రామ్ గోపాల్ వర్మ వ్యక్తం చేయడం జరిగింది. భారీ స్థాయిలో అంచనాల నడుమ తమిళంలో ఈ చిత్రం రీమేక్‌కు సన్నాహకాలు జరుగుతున్నాయి. కార్తికేయ పాత్రను ఇప్పటికే ఆదితో చేయించేందుకు అక్కడ ఫిల్మ్ మేకర్స్ సిద్దం అయ్యారు. సినిమాలో హీరో పాత్ర చాలా అమాయకపు మరియు రఫ్‌గా కనిపిస్తాడు. కాని ఆది మాత్రం అలా కనిపించడం కష్టం.
హీరో పాత్రకు ఆది అన్‌ఫిట్ అంటూ అప్పుడే కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో హీరోయిన్‌గా తాప్సిని ఎంపిక చేయడం జరిగింది. కథానుసారంగా ఈ చిత్రంలో కొత్త అమ్మాయి హీరోయిన్‌గా అయితేనే అన్ని విధాలుగా బాగుంటుంది. కాని తాప్సి చిత్రంలో ఉండటం వల్ల సినిమా కథ ఫోకస్ అంతా మారిపోతుందని, తాప్సిని ప్రేక్షకులు నెగటివ్‌గా చూసేందుకు ఆసక్తి చూపించరు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ నెగటివ్ పాత్రలో కనిపించబోతుంది. తాప్సిని ప్రేక్షకులు నెగటివ్ పాత్రలో చూస్తారో లేదో అంటూ అప్పుడే సినీ వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హీరో, హీరోయిన్ ఎంపికతోనే ఆర్‌ఎక్స్ 100 తమిళ వర్షన్ ఫ్లాప్ అయ్యిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.