భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదిమానవుల రాతిచిత్రాలు

aadhivasi lithographs in badradri kotthagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అద్భుత రాతిచిత్రాలు వెలుగు చూశాయి. కొండవీటి గోపీవరప్రసాద్‌రావు అన్వేషణలో ముల్కలపల్లి మండలం నల్లముడి అనే గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ రాతిచిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతంలో ఆదిమానవుడి ఆనవాళ్లు ఉండవచ్చన్న అంచనాలతో జరిపిన అన్వేషణలో అక్షరలొద్దికి 2 కి.మీ. దూరంలో ఇవి కనిపించాయి. స్థానికులు ఈ ప్రాంతాన్ని ఒంటిగుండుగా పిలుస్తారు. తెలంగాణ జాగృతి సభ్యులు డాక్టర్ మురళీధర్‌రెడ్డి, శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్ ఈ కొత్తరాతి చిత్రాల వివరాలు సేకరిస్తున్నారు.