Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హీరోయిన్లు పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకుని, ఫంక్షన్ లకు హాజరుకావటం…మీడియా వారిని ఫొటోలు తీస్తే..అసభ్యంగా ఉన్నాయంటూ గగ్గోలు పెట్టడం అన్ని ఇండస్ట్రీల్లోనూ కామన్. మోకాళ్లపైకి ఉండే డ్రెస్సులు వేసుకొచ్చే హీరోయిన్లు….ఎంత జాగ్రత్తగా ఉన్నా…ఫొటోగ్రాఫర్ల దృష్టిలో పడకుండా తప్పించుకోలేరు. జనం మధ్యకు, మీడియా ప్రతినిధులు ఉన్న చోటుకు వచ్చేటప్పడు హీరోయిన్లు అసలు అలాంటి డ్రెస్ లు ఎందుకు వేసుకుంటారో…..ఒకవేళ ట్రెండీగా ఉండేందుకు వాళ్లు వేసుకొచ్చునా…ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసే సమయంలో ఎందుకు సభ్యత పాటించరో ఎవరికీ అర్ధం కాదు. వేసుకొచ్చిన వాళ్లది తప్పా…తీసిన వాళ్లది తప్పా అన్న చర్చను పక్కనపెడితే..తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కు ఇలాంటి పరిస్థితే ఎదురయింది. దీనిపై అభిషేక్ బచ్చన్ తీవ్రంగా స్పందించడం నెట్ లో వైరల్ గా మారింది.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన ఓ పార్టీకి ఐశ్వర్య భర్త అభిషేక్ తో కలిసి హాజరయింది. పార్టీ ముగిసిన తర్వాత వాళ్లిద్దరూ ఇంటికి వెళ్లేందుకు తమ ఆడి కారు దగ్గరికి వచ్చారు. అప్పటికే ఫొటో గ్రాఫర్లు వాళ్ల ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా అభిషేక్ కార్ డ్రైవ్ చేస్తూ…ఐశ్వర్య నిల్చున్న చోటికి తీసుకురాగానే…ఆమె కారు ఎక్కింది..వరుసగా ఫొటో గ్రాఫర్లు ఫొటోలు క్లిక్ చేస్తున్నారు. దీంతో ఐశ్వర్య భర్త అభిషేక్ కు ఓ డౌట్ వచ్చింది. ఆమె డ్రెస్ మోకాళ్లపై వరకూ ఉండడంతో..ఆమె కారులో కూర్చునే సమయంలో అసభ్యంగా ఫొటో తీశారేమోనన్న సందేహంతో కారుకు దగ్గరగా ఉన్న కెమెరామెన్ ను అభిషేక్ పిలిచాడు. అతను వినయంగా దగ్గరకు వెళ్లిన తరువాత ఐశ్వర్య కూర్చుంటున్నప్పుడు ఫొటో తీశావా అని కోపంగా అడిగాడు. అలాంటి ఫొటోలేమీ తీయలేదని, మామూలు ఫొటోలు మాత్రమే తీశానని అతను సమాధానమిచ్చాడు. అనుమానం తీరని అభిషేక్ కెమెరాను చూపించమని అడిగి…అలాంటి ఫొటోలేదని రూఢీ చేసుకున్న తర్వాత కారు ముందుకు పోనిచ్చాడు. భర్త పక్కనే ఉన్న ఐశ్వర్య మౌనంగా ఇదంతా గమనించింది. అయితే అభిషేక్ తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. భార్య గౌరవాన్ని కాపాడాలనుకునే వ్యక్తయితే..అసలు ఐశ్వర్య తో అలాంటి డ్రెస్ వేసుకోవద్దనే చెప్పొచ్చు కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.