గత లోక్ సభ ఎన్నికల్లో మోడీ హవా గట్టిగా వీయడంతో అప్పటి వరకు పాలించిన కాంగ్రెస్ ని పక్కన పెట్టి మోడీని గద్దెనెక్కించారు. అయితే ఈ మధ్యలో జరిగిన ఎన్నికలు కొన్ని నిరాస పరిచినా ఇప్పటి దాకా అయితే బీజేపీనే పై చేయి సాదిస్తూ వచ్చింది అయితే బీజేపీకి షాకిచ్చింది ఒక సంస్థ, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయనుందని ఏబీపీ న్యూస్ – సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుందని, బీజేపీకి పెను షాక్ తగలనుందని పేర్కొంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో పోరు తీవ్రంగా జరుగుతుందని, స్వల్ప మెజారిటీతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్సేనని తెలియజేసింది. అయితే, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మోదీ హవా పనిచేస్తుందని సర్వేలో వెల్లడైంది.
సర్వే వివరాలు…రాజస్థాన్
కాంగ్రెస్ పార్టీకి 51 శాతం ఓట్లు రావొచ్చు. బీజేపీకి 37 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. 200 నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో హస్తం పార్టీ 130 సీట్లు గెలుచుకునే చాన్స్ ఉంది. అయితే, 2013 ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లు దక్కించుకుంది.
సర్వే వివరాలు…మధ్యప్రదేశ్.
మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీని వల్ల కాంగ్రెస్ లాభపడుతుందని సర్వేలో తేలింది. హస్తం పార్టీకి 42 శాతం, బీజేపీకి 40 శాతం ఓట్లు రావొచ్చని సర్వే వెల్లడించింది. అయితే, విజయానికి కావాల్సినన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని, ఆ పార్టీకి 117 సీట్లు రావొచ్చని తెలిపింది.
సర్వే వివరాలు…ఛత్తీస్‌గఢ్,
మూడుసార్లు ఛత్తీస్‌గఢ్ సీఎంగా ఉన్న రమణసింగ్‌కు ఈ సారి భంగపాటు తప్పదరి సీ ఓటర్ – ఏబీపీ సర్వే చెబుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాషాయ జెండాను దించి కాంగ్రెస్ జెండా ఎగరొచ్చని సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి 40 శాతం, బీజేపీకి 39 శాతం ఓట్లు రావొచ్చని సర్వే వెల్లడించింది. 90 నియోజకవర్గాలున్న ఛత్తీస్‌గఢ్‌లో హస్తం పార్టీ 54 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.