తెలంగాణలో ఈ మధ్య కాలంలో బాంబు బెదిరింపు కాల్స్ బాగా ఎక్కువవుతున్నాయి. గతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, పలు ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాల్లో బాంబు ఉందని ఏదో ఒక సందర్భంలో కాల్స్ ఎక్కువగా వస్తూ ఉండేవి . ఇక హైదరాబాద్ నగరంలో అయితే ఉగ్రవాదులు లుంబిని పార్కు, గోకుల్ చాట్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల ల్లో బాంబుల బ్లాస్ట్ ల వలన అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.
ఇక నిన్నటికి నిన్న తెలంగాణ ప్రజాభవన్, నాంపల్లి కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందని బెదిరింపులకి పాల్పడ్డారు. ఆ నిందితుడు తాజాగా అరెస్ట్ కూడా అయ్యాడు. బుధవారం శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ప్రజాభవన్, నాంపల్లి కోర్టుకి నిన్న బాంబు బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపిన విషయం అందరికి తెలిసిందే. రెండు ఫోన్ కాల్స్ ఒకటే అని భావించిన పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేసారు . అయితే ఫోన్ నంబర్ ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు.