Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Actor Nani Full Filling His Dream By Acting With Mani Ratnam
టాలీవుడ్ లో విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న యువ హీరో నానికి ఒక కల ఉంది. అది వెటరన్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించాలని. త్వరలోనే నాని కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. తన తదుపరి సినిమాలో మణిరత్నం నానికి చాన్స్ ఇచ్చినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో మిగిలిన నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. తమిళ హీరోయిన్ జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్ ఇప్పటికే ఈ సినిమాకు సంతకాలు చేశారు. అక్టోబరు నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా జ్యోతిక తెలిపారు. ఆరు పాత్రల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ హీరో పాత్రను మణిరత్నం నానికి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఆఫర్ ను నాని అంగీకరించాడని, చిత్ర బృందం త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన చేస్తుందని కోలీవుడ్ కథనం. మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఉందని నాని పలు ఇంటర్వ్యూలో చెప్పారు. దుష్కర్ సల్మాన్, నిత్యమీనన్ నటించిన మణిరత్నం మూవీ ఒకే బంగారానికి తెలుగులో హీరో పాత్రకు నాని డబ్బింగ్ చెప్పారు. ప్రస్తుతం నాని తెలుగులో రెండు చిత్రాలుతో బిజీగా ఉన్నారు. ఎం.ఎల్.ఏతో పాటు కృష్ణార్జున యుద్ధం షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాల మధ్యే డేట్స్ ఎడ్జస్ట్ చేసి మణిరత్నం మూవీలో నటించే అవకాశముంది.
మరిన్ని వార్తలు