Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాదారణంగా అత్యాచారంకు సాదారణ యువతులు మరియు మహిళలు గురవుతూ ఉంటారు. కాని ఇటీవల సెలబ్రెటీలు రేప్‌కు గురవ్వడం, లైంగిక వేదింపులకు గురవ్వడం మీడియాలో చూస్తున్నాం. కొన్ని గంటల ముందు హీరోయిన్ అమలాపాల్ లైంగిక వేదింపుల కేసు బుక్ చేసిన విషయం తెల్సిందే. ఆ విషయం గురించి చర్చించుకుంటున్న సమయంలోనే హీరోయిన్ సనూషాపై అత్యాచార యత్నం జరిగింది. మలయాళంకు చెందిన ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు ‘రేణిగుంట’ అనే డబ్బింగ్ చిత్రం ద్వారా సుపరిచితురాలు. తెలుగులో ఆ తర్వాత పెద్దగా కనిపించని సనూషా మలయాళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తుంది.
తాజాగా ఈమె రైల్లో ప్రయాణిస్తు నిద్ర పోతున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడట. తనపై జరిగిన అత్యాచార యత్నంను వెంటనే రైల్వే టీటీకి చెప్పడంతో ఆయన రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆ వెంటనే అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందట. కున్నూరు నుండి తిరువనంతపురం వెళ్తున్న సమయంలో తనపై అత్యాచార యత్నం జరిగిందని సనూషా పోలీసు కేసులో తెలియజేయడం జరిగింది. సనూషాపై అత్యాచార యత్నంను రైల్వే పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. రైల్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం మంచి పరిణామం కాదని, రైల్వేపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ఈ కేసులో సీరియస్‌గా వ్యవహరించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.