సినిమా పరిశ్రమకు రాజకీయ వ్యవస్థకు చాలా దగ్గర సంబంధం ఉన్నది ఎంతో మంది స్టార్స్ సినిమా నుండి రాజకియలోకి వచ్చి ఓ వెలుగు వెలిగినవారు ఉన్నారు. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్, యమ్జిఅర్, జయలలిత, జమున, చిరంజీవి ముందు ఉంటారు. ఆనాటి అందాల తార జమున ఓ సందర్బంలో…. సినిమా వారు రాజకియలోకి రావడం చాలా కామన్ కానీ ఇప్పుడు సినిమా వారు రాజకియలోకో రాకపోవడమే చాలా మంచిది అన్నారు. ఇప్పుడు,ఒక్కపుడు ఉన్న పరిస్థితి లేద్దన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే తెలుగు ప్రజలు ఆదరించారు. నేను కూడా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కోరికమేరకు రాజకియలోకి వచ్చి రాజమండ్రి నుండి పోటి చేసి ఎంపీ గా పార్లమెంట్ లో అడుగు పెట్టాను. మా నియోజక అభివృద్దికి ఎంతగానో తోడ్పడ్డాను. కానీ ఇప్పుడు ఉన్న రాజకియలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి 50 కోట్లు దాక సంపాదించుకుంటున్నారు.
నాకు తెలిసిన వరకు సినిమా వాళ్ళు రాజకియలోకి రాకపోవడం చాలా మమంచిది అన్నారు. అలా చిరంజీవి రాజకియలోకి వచ్చి పార్టీ పెట్టి చాలా దెబ్బతిన్నాడు. నేను ఆ టైంలో చిరంజీవికి రాజకియలోకి రావద్దని చెప్పాను కానీ అప్పుడు చిరంజీవి నవ్వి ఊరుకున్నారు. ఆ తరువాత పరిస్థితి ఏమిటో మీరు చూస్తున్నారుగా. నాకు చిరంజీవి పరిచయం కావున చెప్పను పవన్ కళ్యాణ్ పరిచయం లేదు కావున ఆ విషయం నేను పవన్ కు చెప్పలేను అన్నారు సినిమాలో నటించే స్టార్స్ ను దేవుళ్ళు గా చూస్తారు కానీ రాజకియలోకి వచ్చేసరికి ఆ పరిస్థితి మారిపోతుంది అన్నారు జమున. సినిమాలో ఉంటేనే ఆ స్టార్స్ కి గౌరవంని ఆమె ఉద్దేశం తెలిపారు.