శ్రియ ర‌హ‌స్య వివాహం చేసుకుంది…

shriya saran gets wedding to Russian boyfriend Andrei Koscheev

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
దక్షిణాదితో పాటు ఉత్త‌రాదిన గుర్తింపు పొందిన హీరోయిన శ్రియ ర‌హ‌స్యంగా వివాహం చేసుకుంది. కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో ప్రియుడు, రష్యాకు చెందిన‌ ఆండ్రీ కోషివ్ ను ఆమె ఈ నెల 12న వివాహం చేసుకుంది. ముంబై అంథేరిలోని శ్రియ నివాసంలో ఆండ్రీతో ఆమె పెళ్లి చాలా సింపుల్ గా జ‌రిగిపోయింది. ఈ మేర‌కు మిడ్ డే టాబ్లాయిడ్ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియ… త‌న పెళ్లికి తెలుగు వారినెవ్వ‌రినీ పిల‌వ‌లేదు. కోలీవుడ్, బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను కూడా ఆమె త‌న వివాహానికి ఆహ్వానించ‌లేదు. శ్రియ ఇంటిప‌క్క‌నే ఉన్న బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయ్, ఆయ‌న భార్య ష‌బానా మాత్ర‌మే ఈ పెళ్లికి హాజ‌ర‌య్యారు.

వివాహానికి ముందు విందు కార్య‌క్ర‌మం కూడా ఘ‌నంగా నిర్వ‌హించిన‌ప్ప‌టికీ… శ్రియ సినిమావాళ్ల‌నెవ్వ‌రినీ పిల‌వ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. శ్రియ పెళ్లి గురించి గ‌త నెల‌లో ఊహాగానాలొచ్చాయి. జోధ్ పూర్ లో శ్రియ వివాహం జ‌ర‌గ‌నుందని, ఇందుకోసం ఆమె భారీగా షాపింగ్ కూడా చేసింద‌ని వార్త‌లొచ్చాయి. షాపింగ్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని, అయితే త‌న పెళ్లికోసం కాద‌ని, ద‌గ్గ‌రి పెళ్లి బంధువు కోసమ‌ని, త‌న వివాహం వార్త‌ల్లో నిజం లేద‌ని ప్ర‌క‌ట‌న కూడా చేసిన శ్రియ ఇప్పుడు చెప్పాపెట్ట‌కుండా పెళ్లిపీట‌లెక్కింది. శ్రియ టాలీవుడ్ లో చివ‌రిగా… గాయ‌త్రి సినిమాలో మంచు విష్ణు స‌ర‌స‌న న‌టించింది. వివాహం త‌రువాత శ్రియ సినిమాల్లో న‌టిస్తోందా లేదా అనేది ఇంకా తెలియ‌దు.