అదిరింది (తమిళ్ ‘మెర్సిల్’)… తెలుగు బులెట్ రివ్యూ

Adirindi Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు : విజయ్ , సమంత , కాజల్ , నిత్యా మీనన్ , ఎస్ జె  సూర్య 
నిర్మాతలు  : రామస్వామి , హేమ రుక్మిణి , ఆర్.మహేంద్రన్ , మురళి 
దర్శకత్వం :  అట్లీ 
మ్యూజిక్ డైరెక్టర్ :  ఏ. ఆర్. రెహ్మాన్
సినిమాటోగ్రఫీ :  జీకె విష్ణు 
ఎడిటర్ : రూబెన్

తమిళ్ టాప్ స్టార్ విజయ్, రాజారాణి సినిమా ఫేమ్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో వచ్చిన అదిరింది( తమిళ్ లో మెర్సెల్) సినిమాకి ఎన్నో విశేషాలున్నాయి. ఈ సినిమాకి కథ అందించింది తెలుగు రచయిత విజయేంద్రప్రసాద్ .విజయ్ కి ఇది 61 వ సినిమా. ఈ సినిమాని తమిళ్ లో తీసిన ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ కి వందో సినిమా. ఇక సినిమాకి మ్యూజిక్ ఏ. ఆర్. రెహ్మాన్. తెలుగులో చిరపరిచితమైన కాజల్,సమంత, నిత్యా మీనన్ ఈ సినిమాలో చేస్తున్నారు. ఇక పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి సినిమాలు చేసిన శరత్ మరార్ దీన్ని తెలుగులో చేస్తున్నారు. ఈ విశేషాలతో పాటు విజయ్ డబల్ రోల్ ఈ సినిమాకి హైలైట్. ఇక విజయ్, రెహ్మాన్ ఇద్దరు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా తీసిన సినిమా ఇది. ఇన్ని విశేషాలున్న అదిరింది ఎలా వుందో చూద్దామా.

కధ…

వైద్య వృత్తికి సంబంధించిన ప్రముఖులు వరసగా కిడ్నాప్ లేదా మర్డర్ అవుతుంటారు. పోలీసులు ఈ కేసు విచారణ చేస్తున్నప్పుడు ఇందులో ఓ వైద్యుడు హస్తం ఉన్నట్టు కనుక్కుంటారు. డాక్టర్ అయిన అతను ఈ పని ఎందుకు చేస్తున్నాడు ? దాని వెనుక వున్న కారణాలు ఏంటి అన్నది అదిరింది సినిమా.

విశ్లేషణ…

విడుదలకి ముందు తమిళనాట భారీ హైప్ వచ్చిన సినిమా ఇది. విజయ్ భిన్నంగా రెండు పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా కార్పొరేట్ వైద్యం లోని లోపాల్ని, అక్కడ జరిగే అన్యాయాల్ని ప్రశ్నించడానికి అన్నట్టు ప్లాన్ చేసుకున్నారు. అయితే కథ, కథా గమనంలో ఎక్కడా కొత్త పోకడలు లేవు. చిరంజీవి అప్పుడెప్పుడో చేసిన ఠాగూర్ సినిమా అదిరింది చూస్తున్నప్పుడు తప్పకుండా గుర్తుకు వస్తుంది. మెయిన్ ప్లాట్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సహా ఎక్కడా కొత్తదనం అనిపించలేదు. హీరో విజయ్ ని సమంత ఇంటర్వ్యూ చేసే సీన్ చాలా బాగుంది. దాని చుట్టూ స్టోరీ తిరుగుతుంది అనుకుంటే రొటీన్ రివెంజ్ స్టోరీ గా వెళ్ళిపోతుంది. అదిరింది మాత్రం ఒక్క విజయ్ ఫాన్స్ కి మాత్రమే ఎక్కే సినిమా.

ప్లస్ పాయింట్స్ …

విజయ్ నటన
భారీ నిర్మాణ విలువలు
రెహ్మాన్ సంగీతం

మైనస్ పాయింట్స్ …

పాత కథ, కధనాలు
అంతా ఊహించినట్టే ఉంటుంది.

తెలుగు బులెట్ పంచ్ లైన్… “అదిరింది” అనుకోడానికి కొత్తగా ఏమీ లేదు.
తెలుగు బులెట్ రేటింగ్… 2 .75 /5 .

Kill Piracy And Watch Movie in Theaters