Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఐ ఫోన్, ఐ ప్యాడ్ ల తర్వాత ప్రపంచమంతా దృష్టిసారించబోయేది ఐ క్రియేట్ పైనే అంటున్నారు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు. గుజరాత్ లోని అహ్మాదాబాద్ శివార్లలో ఉన్న డియోధోలెరా గ్రామంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఐ క్రియేట్ సెంటర్ ను భారత ప్రధాని మోడీతో కలిసి నెతన్యాహు ప్రారంభించారు. ఐ క్రియేట్ గా పిలుచుకుంటున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ టెక్నాలజీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటయింది. దేశ ప్రజల అవసరాలకు తగ్గట్టు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అంకురించే సంస్థలకు చేయూతనిచ్చేందుకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు ఐ క్రియేట్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉపయోగపడుతుంది. ప్రారంభించిన తొలిరోజే 38 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. వీటిలో 18 భారత్ కు చెందినవి కాగా, 20 ఇజ్రాయిల్ ఎంటర్ ప్రెన్యూర్ లు రూపొందించినవి. ఇండియా ఇజ్రాయిల్ సహకారాత్మక ప్రయాణంలో ఐ క్రియేట్ ఏర్పాటు ఒక కీలక ముందడుగని, నెతన్యాహు అన్నారు. జైహింద్, జై భారత్, జై ఇజ్రాయిల్ అనడం ద్వారా భారత్ కు తమ దేశం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చెప్పకనే చెప్పారు.