మళ్లీ అదే ఉత్కంఠ.. మోడీ 4.0 ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మళ్లీ ప్రసంగించనున్నారు. దీంతో దేశ ప్రజల్లో మళ్లీ అదోరకమైన ఉత్కంఠ నెలకొంది. అంతే ఆసక్తి కూడా కొనసాగుతుంది. లాక్‌డౌన్ విధించడం.. అలాగే.. టాస్క్‌లు కొనసాగించడం వంటి కీలక సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న భారత ప్రధాని.. ఈరోజు రాత్రి 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీనినిపై సోషల్ మీడియాలో వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం కాసేపటి క్రితమే ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్న ప్రధాని మోడీ.. లాక్‌డౌన్ కొనసాగింపుపై కూడా అభిప్రాయాలు తీసుకున్నారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ వ్యూహంపై ముఖ్యమంత్రులతో మాట్లాడిన ఒక రోజు తర్వాత మోడీ ఈరోజు రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ.. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ముందుకు వెళ్ళే మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. అన్ని మార్గదర్శకాలకు కట్టుబడి, వ్యాధి తీవ్రతను అరికట్టే దిశగా కృషి చేయాలని మోడీ కోరారు. అదే సమయంలో ప్రజా కార్యకలాపాలను క్రమంగా పెంచడం కూడా అవసరమని తెలిపారు. ఇంకా తొలి దశలో లాక్‌డౌన్‌లో అవసరమైన చర్యలు రెండవ దశలో అవసరం లేదని.. మూడవ దశలో అవసరమైన చర్యలు నాల్గో దశలో అవసరం లేదని.. తాను గట్టిగా అనుకుంటున్నట్లుగా కూడా మోడీ స్పష్టం చేశారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ పొడగించే అకాశం లేదనే చర్చ కూడా సాగుతోంది. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ 3.0 ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఇక మోడీ నిన్ననే సీఎంలతో ఐదోసారి జరిపిన చర్చల్లో మెజారిటీ సీఎంలు లాక్‌డౌన్ కొనసాగించాలని కోరారు. మరి ఇప్పడు మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించే అవకాశం కూడా ఉందని సమాచారం అందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడనుండటంతో మళ్లీ ఆ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.