Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్, త్రివిక్రమ్ మూవీ అనగానే డిస్ట్రిబ్యూటర్లు భారీ అంచనాలు పెట్టుకుని కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు. కాని పరిస్థితి తారుమారు అయ్యింది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించిన అజ్ఞాతవాసి కాస్త బొక్క బోర్లా పడటం జరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు 150 కోట్ల వరకు ఈ చిత్రం బిజినెస్ చేసిందని సమాచారం అందుతుంది. అంటే ఇప్పుడు బయ్యర్లు బయట పడాలి అంటే 150 కోట్ల కలెక్షన్స్‌ను చిత్రం వసూళ్లు చేయాల్సి ఉంటుంది. కాని ఆ స్థాయిలో వసూళు చేయడం అనేది దాదాపు అసాధ్యం అని మొదటి రోజు టాక్‌తోనే తేలిపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా ‘అజ్ఞాతవాసి’ చిత్రం లాంగ్ రన్లో 150 కోట్లను వసూళ్లు చేయకపోతే డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాల్లో మునిగే అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఎగ్జిబ్యూటర్లు కూడా ఇప్పుడు భారీగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. సగానికి పైగా అంటే 75 కోట్లకు పైగా బయ్యర్లు బలి అవ్వాల్సిందే అని, ఏరియాలను బట్టి డిస్ట్రిబ్యూటర్ల నష్ట పరిమానం మారుతుందని, నైజాం ఏరియాతో పాటు ఉత్తరాంద్ర ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. మొత్తానికి అజ్ఞాతవాసికి వస్తున్న టాక్‌తో బయ్యర్లు గుండె పట్టుకుని కూర్చున్నారు. పవన్ మూవీ అనే నమ్మకంతో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు కళ్లు తిరిగి పడిపోయే పరిస్థితి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లను పవన్ ఏమైనా ఆదుకుంటాడేమో చూడాలి.