Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ విడుదలకు సిద్దం అయ్యింది. పవన్‌కు ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించడం జరిగింది. పవన్ కెరీర్లోనే కాకుండా త్రివిక్రమ్ కెరీర్లో కూడా ఇది నిలిచి పోయే సినిమాలా ఉంటుందని సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఇక ఫ్యాన్స్ కూడా ‘అజ్ఞాతవాసి’ చిత్రం కోసం భారీ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 90 శాతం థియేటర్లలో మొదటి రెండు రోజులు ‘అజ్ఞాతవాసి’ని ప్రదర్శించనున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు మరో నైజాంగా చెప్పుకుంటున్న ఓవర్సీస్లో కూడా ‘అజ్ఞాతవాసి’ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా విడుదల కాని రేంజ్లో విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. దాంతో పాటు మరో రికార్డును కూడా అజ్ఞాతవాసి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా యూనివర్శిల్ స్టూడియోలో స్క్రీనింగ్ జరగలేదు. కాని ఈసారి మాత్రం అజ్ఞాతవాసి చిత్రాన్ని అక్కడ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.
జనవరి 9న ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్‌ను యూనివర్శిల్ స్టూడియోస్‌లోని థియేటర్లో ప్రదర్శించబోతున్నట్లుగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. ఇండియా నుండి మొదటి చిత్రంగా అజ్ఞాతవాసి అక్కడ ప్రదర్శించబడుతుండటం తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం. పవన్ స్థాయి ఏంటో దీంతో తేలిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ నిర్మించగా కీర్తి సురేష్, అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటించారు. దాదాపు 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.